ప్రభుత్వ భూ కబ్జాలపై ఉక్కు పాదం తహసిల్దార్ జ్యోత్స్న

బెల్లంపల్లి మున్సిపల్ మండల పరిధిలోని ప్రభుత్వ భూ కబ్జాలపై ఉక్కు పాదం మోపుతానని తహసిల్దార్ జ్యోత్స్న స్పష్టం చేశారు. నూతన బెల్లంపల్లి తహసిల్దారుగా ఆమె బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన ప్రసాద్ ను జిల్లా కలెక్టరేట్ కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో డిఏఓగా పనిచేస్తున్న జ్యోత్స్నను తహసిల్దార్ గా నియమించారు.

தொடர்புடைய செய்தி