సింగరేణిలో పనిచేస్తున్న 2, 349 మందిని క్రమబద్ధీకరిస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాలెండర్ ఏడాదిలో భూగర్భగనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులరైజ్ చేసింది. సెప్టెంబర్ 1 2024 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.