నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన కురుమ హనుమయ్య(77) శనివారం పురుగుల మందు సేవించి అతహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు. తన కుమారుడు గత కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో మనస్థాపంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు సేవించగా, మెదక్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ. తెలిపారు.