రాష్ట్ర హైకోర్టు భవనాన్ని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాలని కోరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మేల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ. వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన యూనివర్సిటీ భూములను హైకోర్టు భవన నిర్మాణానికి తీసుకోవద్దని సూచించారు.