నవాబ్ సహబ్ కుంటలో పర్యటించిన బహదూర్‌పురా ఎమ్మెల్యే

క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ అన్నారు. మంగళవారం నవాబ్ సహాబ్ కుంట డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ లైన్ సమస్యలు, నూతనంగా రోడ్లు వేయించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி