నవంబర్ 6 బుధవారం నుంచి ఎన్యూమరేటర్ బ్లాక్ వారీగా కుటుంబాల జాబితా రూపొందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఎన్యూమరేటర్ కు ఉత్తర్వుకాపీ అందాలని, ఇంకా ఎవరైనా శిక్షణ పొందని ఎన్యూమరేటర్లు ఉంటే తక్షణమే శిక్షణ ఇవ్వాలని జిల్లా ప్రణాళిక అధికారిని ఆదేశించారు.