నాగర్ కర్నూల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం కల్పించిన మౌళిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ గురువారం ఆదేశించారు. నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒపి పెషంట్ల సంఖ్యను పెంచేలా ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి అందించే వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி