దేవరకద్ర: పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం రాత్రి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. మండల కేంద్రంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిధిలోని ఇస్రంపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி