పదేళ్ల కిందట ధనుష్ నిర్మాతగా నయనతార సినిమా చేసింది. దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఇటీవల నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. ఇందులో నానుమ్ రౌడీ దాన్ షూటింగ్ సందర్భంగా నయనతారకి విఘ్నేష్ సీన్ వివరిస్తున్న 15 సెకన్ల క్లిప్‌ను వాడారు. తన అనుమతి లేకుండా ఎలా వాడతారంటూ నయనతారకి ధనుష్ రూ.10 కోట్ల లీగల్ నోటీసులు పంపారు. దీంతో ధనుష్‌పై నయనతార, విఘ్నేష్ తీవ్ర విమర్శలు చేశారు.