అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల భాగస్వామ్యం కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం నందిగాం ఉన్నత పాఠశాలలో ఎంపీపీ శ్రీరామమూర్తితో కలిసి ప్రారంభించారు. తిలక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తమ ప్రతిభను చూపించి పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.