తలుపుల మండలం నూతన ఎస్సైగా నరసింహుడు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ గతంలో కదిరి డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో పని చేసిన అనుభవం ఉందని, పట్నం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ తలుపుల కు బదిలీపై రావడం జరిగిందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలుకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ కి సిబ్బంది అభినందనలు తెలిపారు.