ఎర్రగుంట్ల మండల పరిధిలోగల రాయలసీమ తాప విద్యుత్ కేంద్రంలో ఉద్యోగులు శనివారం ధర్నా చేపట్టారు. పరిశ్రమలోని అకౌంట్ విభాగానికి చెందిన సిబ్బంది సీఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. విధులకు సంబంధించిన పని వేళల్లో మార్పులు చేశారని నిరసన వ్యక్తం చేశారు. మునపటిలాగే పని వేళలు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.