ప్రభుత్వ అసైన్డ్ భూమిని పేదలకు పంచాలని సీపీఐ కడప జిల్లా సమితి సభ్యులు సోమవారం డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మి దేవి కి ఓ వినతి పత్రం అందించారు కడప జిల్లాలో గల అసైన్డ్ భూములను పేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెండెకరాల చొప్పున ప్రభుత్వం అందించాలని వారు వినతిలో కోరారు అనంతరం వారు మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు వేలాది ఎకరాలప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగిస్తున్నాయని, నిరుపేదలకు ఎకరం భూమి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. జిల్లాలో భూమి లేని నిరుపేదలకు రెండు ఎకరాల ప్రభుత్వ సాగుభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం చేసుకునే వారికి భూమి లేదని. కానీ వ్యవసాయం చేయని వారికి వేలాది ఎకరాల భూములు ఉన్నాయని అన్నారు. కడప జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములున్నాయని, వాటిని వెంటనే పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించుకొని బోగస్ పట్టాలు చేసుకున్నారని, ఇలాంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోని నిరుపేదలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లోని నిరుపేదలకు రెండు ఎకరాల భూమి ఇచ్చి వారి జీవితాలలో వెలుగు నింపాలన్నారు బోగస్ పట్టాలు రద్దు చేసి భూమిలేని నిరుపేదలకు వర్గాలకు భూములు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలని లేకుంటే, సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూపోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి భవాని శంకర్, శరత్, లీలా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.