ఎర్ర నేలగుంట గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాం

తణుకు మండలం మండపాక శివారు ఎర్రనేలగుంట గ్రామంలో సోమవారం డాక్టర్ బంగారు రవి ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుమేహం, రక్త పోటు వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడా మందులు, మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్న వారిని ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది జయరాజు, ప్రవీణ, వై టి మూర్తి, అనురాధ, సాయిరాం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி