మంగళగిరి: డిప్యూటీ సీఎంకి ధన్యవాదాలు తెలిపిన వైద్యశాఖ ఉద్యోగులు

ఔట్ సోర్సింగ్ విధానంలో మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా తమకు జీతాలు లేవని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి ఉద్యోగులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బుధవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకొని సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం చేసినందుకు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎమ్ఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.

தொடர்புடைய செய்தி