తంబళ్లపల్లి: భార్య కాపురానికి రాలేదని చేయి కోసుకున్న భర్త

భార్య కాపురానికి రాలేదని భర్త చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు. తంబళ్లపల్లి మండలం పర్సంపల్లికి చెందిన బాలు (27) భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. నెల రోజులైనా కాపురానికి రాలేదని మనస్థాపంతో యువకుడు ఇంట్లోనే కత్తితో చేతి నరాలు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி