పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అనధికార కుళాయిలను వెంటనే రెగ్యులర్ చేయించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు సిబ్బందికి సూచించారు. గురువారం పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఆయన సచివాలయ అడ్మిన్, కమ్యూనిటీ సెక్రటరీలతో సమావేశమై ఆస్తి, నీటి పన్నులతో పాటు ఇళ్ల విషయాలకు సంబంధించి చర్చించారు. విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.