మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం రెండవ రోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్న ను వైసీపీ నాయకులు, ప్రజలు, అభిమానులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపారు. వైఎస్ జగన్ను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.