మదనపల్లి నేషనల్ హైవే మీద ఆక్రమణలను తొలగించండి

మదనపల్లి మీదుగా వెళుతున్న జాతీయ రహదారిపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష అన్నారు. శనివారం నేషనల్ హైవే అథారిటీ అధికారులు, మదనపల్లి ఎమ్మార్వో ఖాజాబీ లతో కలిసి జాతీయ రహదారి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు వెడల్పు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు మలుపు వద్ద జరుగుతున్న ప్రమాదాల నివారణకు ఆర్&బి, రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే సంప్రదించారు.

தொடர்புடைய செய்தி