నిమ్మనపల్లి వారపు సంతకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష అన్నారు. బుధవారం వారపు సంతలో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ నిధులతో నిమ్మన పల్లి వారపు సంతలో పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.