రామసముద్రంలో 11.8 మి.మీ వర్షపాతం నమోదు

రామసముద్రంలో సోమవారం 11. 8 మి. మీ వర్షపాతం నమోదైనట్టు శేషయ్య తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. మండలంలోని పలు చోట్ల వ్యవసాయ బావులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలోకి నీరు చేరుతోంది. రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో 2రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி