వల్లూరు: చెరువు ఆయకట్టు భూములకు నీరు విడుదల

వల్లూరు మండల పరిధిలోని కొప్పోలి చెరువు ఆయకట్ట భూములకు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి బుధవారం నీరు విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాలకు కొప్పోలి చెరువు నిండడంతో నీరు వదిలారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ చెరువు నీటిని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు బాగుంటే ప్రభుత్వం బాగుంటుందన్నారు. రైతుల సమస్యలు ఏమన్నా ఉన్నా తమ వద్దకు తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி