కమలాపురం: మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కమలాపురం నగర పంచాయతీ వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో డిసిసి బ్యాంకు ఆవరణలో శుక్రవారం అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే పి.కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. డాక్రా మహిళలు స్వతహాగా తయారు చేసినటువంటి పిండి వంటలను రుచి చూసి పరిశీలించారు. డ్వాక్రా మహిళలు మరింత అభివృద్ధి కోసమే వారికి కావాల్సిన ఆర్థిక సాయం బ్యాంకు రుణాల ద్వారా అందించాలని అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி