బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో గల అన్నాక్యాంటీన్ ను మున్సిపల్ కమీషనర్ వి. వి. నరసింహరెడ్డి సోమవారం పరిశీలించి అక్కడ టిఫిన్ చేస్తున్న పలువురితో మాట్లాడారు. టిఫిన్ నాణ్యత పై అభిప్రాయాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా నాణ్యత తగ్గకుండా జాగ్రత్తగా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన సమయపాలన, పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి తెలిపారు.