యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం జడ్పీ సీ. ఈ. ఓ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజనం, సానిటేషన్ వసతులను పరిశీలించి వసతి పై స్పెషల్ ఆఫీసర్‌కు తగు సూచనలను చేశారు. పాఠశాల మెడిసిన్ సంబంధించి పాఠశాలలో పని చేసే నర్సుకి కస్తరుబా గాంధీ బాలికల విద్యాలయ ఎస్ఓ నుండి మేమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం వలిగొండ ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలించారు.