యాదగిరి గుట్ట దేవాలయ అభివృద్ధి పై ప్రెసిడెన్సియల్ సూట్ లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట కొండపైన పెండింగ్ ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని యాదగిరిగుట్టకు పూర్వ వైభవం తీసుకురావాలని కొండ పైన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని తెలిపారు. యాదగిరిగుట్ట పవిత్రతను కాపాడాలని అధికారులకు సూచించారు.