భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ 107 జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈరపక నరసింహ, సేవాదళ్ పట్టణ అధ్యక్షుడు సోమా రవీందర్, జిల్లా సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు, ఓబీసీ పట్టణ కార్యదర్శి కుమార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.