వరంగల్ జిల్లాలో లైసెన్సులు లేకుండా బాణాసంచా విక్రయిస్తే చర్యలు తప్పవని మంగళవారం జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. బాణాసంచా విక్రయాల కోసం 71 దరఖాస్తులు రాగా 65 దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేశామన్నారు. లైసెన్సులు లేకుండా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తా మని వరంగల్ సీపీ హెచ్చరికలతో గ్రామాలు, మండల కేంద్రాల్లో వ్యాపారులు దరఖాస్తు చేసుకోగా లైసెన్సులు జారీ చేశామన్నారు.