రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సర్వే పై సమీక్షించారు. సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక, సర్వే ఉద్దేశం, కలెక్టర్ లు తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలను వివరించారు.