తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం 2007పై హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, హెల్ప్ ఏజ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్ పాండే హాజరై మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సేవలను అందిస్తుందన్నారు.