ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

77பார்த்தது
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
మంగళవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 78 మంది విద్యార్థులకు గాను 67 మంది ఉత్తీర్ణత సాధించారు. శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 31 మందికి, 24 మంది, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 38 మంది, కరీమాబాద్ పాఠశాలలో 114 మందికి గాను 98 మంది ఉత్తీర్ణత సాధించారు.