భావిభారత పౌరులైన విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకోవడంతో పాటుగా పాటిస్తూ ముందుకు సాగాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా సూచించారు. రాజ్యాంగం ఆమోదింపబడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఈ స్ఫూర్తి పెరుగుతుందని ఆమె కొనియాడారు. మంగళవారం ఏవీవీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ ఛాయా చిత్ర ప్రదర్శన ప్రారంభించారు.