బూర్గంపాడు జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈవో
బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్ విద్యాధికారి హెచ్. వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో రికార్డులను పరిశీలించి అనంతరం తరగతుల్లో విద్యార్థులతో మాట్లాడారు. అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించి విద్యాప్రణాళికలను, విద్యా అవసరాలు, విలువల గురించి పలు సూచనలు చేశారు.