మణుగూరు ఏరియా సింగరేణి ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలను అధికారులు తక్షణమే నియమించాలని సామాజిక కార్యకర్త కర్నే బాబురావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం సింగరేణి మెడికల్ చీఫ్ ఆఫీసర్ సుజాతకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణులు లేకపోవడంతో గర్భిణీలకు సరైన వైద్యం అందడం లేదని పేర్కొన్నారు.