వికారాబాద్ జిల్లా స్థలసేకరణ నిమిత్తం వెళ్ళిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచర్ల గ్రామస్తులు దాడి చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పినపాక తహశీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది అన్నారు. ఈ దాడికి నిరసనగా మంగళవారం తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులలో పాల్గొన్నారు.