విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ. పరకాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి శిథిలావస్థకు చేరిన పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.