పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం డెంగ్యూ జ్వరంతో బాధపడుతూన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిని సందర్శించి ఆ కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట మహేందర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి అంబేద్కర్ వెంకన్న సాయిలు తదితరులు పాల్గొన్నారు.