చుక్కా రామయ్య కు సిఎం రేవంత్ ప్రత్యేక ఆహ్వానం

63பார்த்தது
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూర్ గ్రామానికి చెందిన చుక్కా రామయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. గురువారం విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ను హైదరాబాద్ లోని తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.