నర్సంపేట: ఓటరు నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి
వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, 18 సంవత్సరాలు పూర్తి అయిన యువతి యువకులు ఓటు నమోదు చేయుటకు క్యాంపస్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి అధిక శాతం ఓటరు నమోదు చేసుకొనుటకు ఫారం 6 అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.