బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వరంగల్ జిల్లా నర్సంపేట అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నవీన్ తెలిపారు. కళాశాలలో బుధవారం అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. యాంటీ డ్రగ్ విభాగం సమన్వయకర్త రాంబాబు, ఎన్ఎస్ఎస్ పీవో సంధ్య పాల్గొన్నారు. అనంతరం నర్సంపేటలోని జడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాలలో స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల హక్కుల గురించి వివరించారు.