తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలో ఇంటింటి సర్వే చేసి 88,071 ఇళ్లను గుర్తించి, 902 ఎన్యూమరేషన్ బ్లాక్‌లలో 84,757 ఇళ్లను సందర్శించారని అన్నారు. అనంతరం స్టిక్కర్లను 96.24% అతికించారని తెలిపారు.