మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లిలో గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏకలవ్య గురుకులం ను బుధవారం వర్చువల్ గా ప్రధాని నరేంద్ర ప్రారంభించనున్నట్లు కొత్తగూడ బిజెపి నాయకులు బోడ నవీన్ నాయక్ మంగళవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం సిబిఎస్ఈ సెలబస్ తో పాటు డిజిటల్ విద్యాబోధన నిర్వహిస్తారని తెలిపారు.