ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర్ సమగ్ర కుటుంబ సర్వేపై అధికారులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయడానికి కృషి చేయాలని అన్నారు. కుటుంబ సర్వే పట్ల అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.