ములుగు జిల్లా తరలింపుపై దుష్ప్రచారం సరికాదు: మంత్రి సీతక్క

55பார்த்தது
ములుగు జిల్లా తరలింపుపై దుష్ప్రచారం సరికాదని మంగళవారం మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ. పోరాటాల ద్వారా సాధించుకున్న ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని, జిల్లా అభివృద్ధి అంశంలో వెనక్కి పోయే అంశమే లేదన్నారు. ములుగు జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రత్యేకశ్రద్ధ చూపిస్తుందన్నారు.