ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివాసీ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో వై జంక్షన్ వద్ద కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు గిరిజనులు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం గిరిజనులతో కలిసి సీతక్క కూడా సాంప్రదాయ నృత్యం చేయడంతో అందరూ ఆసక్తితో తిలకించారు.