జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఏసీపీ పార్థసారథి, సత్యనారాయణ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.