మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగే బిఆర్ఎస్ మహాధర్నాకు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయితో మరిపెడకు చేరుకొని కేటీఆర్ రాక కొరకు వేచి ఉన్నారు. ఇతర జిల్లాల నుండి అనుమతులు లేకపోయినా ఇక్కడకు చేరుకోవడంతో స్థానికంగా కొంత చర్చనీయాంశమైంది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.