కాటారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం కాటారం డిఎస్పి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గారేపల్లి లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఓపెన్ హౌస్ లో ఆయుధాల పనితీరును డీఎస్పీ స్వయంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రావు, ఇన్స్పెక్టర్ అభినవ్, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.