భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని శ్రీ నాగులమ్మ ఆలయం పుట్ట వద్ద మంగళవారం తెల్లవారుజాము నుండే పుట్టలో పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్టలో పాలు పోసారు.