తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో లగచర్ల గ్రామస్తులు తమ బాధలు చెప్పుకున్నారు. రైతులు ఎవ్వరూ భూములు ఇవ్వడానికి రెడీగా లేరని.. భూములు ఇవ్వాలని కూడా తమను అడగలేదన్నారు. బుధవారం తిరుపతి రెడ్డి వచ్చి సంతకాలు చేసి భూములను ఫార్మా కంపెనీకి ఇవ్వవమన్నాడని చెప్పారు. వాళ్ళ బాధను విన్న కేటీఆర్.. 'కొడంగల్ లగిచెర్ల రైతులను ఢిల్లీ తీసుకెళ్తా. లగిచెర్ల రైతులను జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు తీసుకెళ్తా' అని అన్నారు.